తొగరాయి పాఠశాలకు గ్యాస్ సిలిండర్, స్టౌ బహుకరణ
06-04-2026 07:26 PM
కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండల పరిధిలోని తొగరాయి గ్రామ హరిజనవాడ ప్రాథమిక పాఠశాలకు సోమవారం పగిడిమర్రి మదన్మోహన్ రావు 6000 రూపాయల విలువగల గ్యాస్ బండ, పొయ్యిని పాఠశాలకు బహుకరించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి సలీం. గ్రామ సర్పంచ్ లిక్కి గురువమ్మ వెంకటయ్య సులోచన రావు, వార్డు సభ్యులు గ్రామస్తులు ఉపాధ్యాయ సిబ్బంది కలిసి ఉమ్మడిగా శాలువా పూలదండతో పి మదన్మోహన్ రావుని ఘనంగా సత్కరించారు.




