21 May, 2026 | 3:16 PM

Breaking News

తెల్ల తెల్లవారుతుండగానే పల్లెల్లోకి పాఠశాలల ప్రచారం.. విత్తన కంపెనీల ప్రచార రతాలు   •   ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం   •   ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి..   •   ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం   •   ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్   •   అనుమతి లేని ప్రైవేట్, విద్యాసంస్థలను మూసివేయాలి   •   కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ కు సైకిల్ బహుకరణ...   •   జైనూర్‌లో చలివేంద్రం – అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు...   •   ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు   •  

మధు కుటుంబాన్ని ఓదార్చిన గంగుల

04-12-2025 07:48 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు మాతృమూర్తి రెడ్డవేణి వజ్రమ్మ అనారోగ్యంతో గురువారం ఉదయం పరమపదించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బావుపేటలోని వారి స్వగృహానికి వెళ్లి వజ్రమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించి రెడ్డవేణి మధు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేష్, నాయకులు కమల మనోహర్, పెంచాల ఆంజనేయులు, రాంగోపాల్, గుర్రాల చంద్రయ్యతో పాటు గ్రామస్థులు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.