7 April, 2026 | 1:36 PM

Breaking News

కేరళ సీఎంకు తెలంగాణ సీఎం సవాల్!   •   తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   షాకింగ్ ఘటన: బంధువుల దాడిలో న్యాయవాది హత్య.. అన్నమయ్య జిల్లాలో కలకలం!   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •  

మహిళపై సామూహిక లైంగికదాడి

01-01-2026 12:00 AM
  1. ఫరీదాబాద్‌లో కదులుతున్న వ్యాన్‌లో దారుణం
  2. ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి వ్యాన్‌లో తీసుకెళ్లిన దుండగులు
  3. రెండున్నర గంటల పాటు పైశాచికం

చండీగఢ్, డిసెంబర్ 31 :  హరియాణాలోని ఫరీదాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న వ్యాన్‌లో  28 ఏళ్ల ఓ మహిళపై దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘాతుకం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాధిత మహిళ సోమవారం రాత్రి ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం వేచి చూస్తుండగా ఓ వ్యాన్ ఆమె వద్ద ఆగింది. ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి ఇద్దరు యువకులు ఆమెను వాహనంలోకి ఎక్కించుకున్నారు.

అనంతరం వ్యాన్‌ను గుర్గావ్ రోడ్డు వైపు మళ్లించి, సుమారు రెండున్నర గంటల పాటు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఎంత వేడుకున్నా వినిపించుకోకుండా బెదిరింపులకు దిగారు. మంగళవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఎస్జీఎమ్ నగర్‌లోని రాజా చౌక్ సమీపంలో ఆమెను కదులుతున్న వ్యాన్ నుంచి బయటకు తోసేశారు.

బాధితురాలికి తీవ్ర గాయాలు

వ్యాన్ నుంచి తోసేయడంతో బాధితురాలి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావంతో ఉన్న బాధితురాలు తన సోదరికి ఫోన్‌లో విషయం తెలపగా.. కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ముఖానికి అయిన గాయాలకు వైద్యులు 10 నుంచి 12 కుట్లు వేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, తీవ్ర షాక్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తతో గొడవల కారణంగా ప్రస్తుతం దూరంగా ఉంటోంది.

ఘటనకు ముందు రోజు రాత్రి తల్లితో గొడవపడి స్నేహితురాలి ఇంటికి వెళుతున్నట్లు సోదరికి సమాచారం ఇచ్చింది. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు నేరానికి వాడిన వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలు కోలుకున్న తర్వాత ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.