22 July, 2026 | 8:04 PM

ఎవరెస్ట్ శిఖరంపై జెండా ఎగరాలి: కలెక్టర్ రాజర్శి షా

22-07-2026 07:01 PM

ఉట్నూర్,(విజయక్రాంతి):  ఎవరెస్టు శిఖరంపై  భారతీయ పతాకావిష్కరణ  చేసే అవకాశం జిల్లాకు చెందిన ఇద్దరూ  పర్వతారోహకులకు దక్కడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్శి షా అన్నారు. బుధవారం ఉట్నూరులోని కేబి కాంప్లెక్స్ నుంచి ఎవరెస్ట్ శిఖర అవరోహణకు బయలుదేరుతున్న మడవి కన్నీవాయి, కాట్లే ఆనందరావులను ఫ్లాగ్ ఆఫ్ చేసి సాగనంపారు. వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి పర్వతారోహణ, రాక్ కైల్లబింగ్ లాంటి సాహస కృత్యాల శిక్షణ పొందాలన్నారు. గిరిజన యువతి యువకులు ముందుకు రావడం ఆనందంగా ఉందని అన్నారు.

మడవి కన్నీబాయి మూడోసారి పర్వతారోపణలకు వెళ్లడం ఆమె పట్టుదలకు  నిదర్శనమని పేర్కొన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జిల్లా యంత్రాంగం తరపున సాధ్యమైనంత ప్రోత్సవ లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మడివి కన్నీబాయి, కాత్లి ఆనందరావుల కుటుంబ, చదువు పర్వతారోపణ నేపథ్యాలను అడిగి తెలుసుకున్నారు. గురువారం నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని, ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం రోజున  ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పై  జాతీయ పతాకాన్ని ఎగరవేస్తామని  వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్  వసంతరావు జాదవ్, ఏజెన్సీ విద్యాధికారి గోడం చందన్, ఏపీఓ ( పివిటిజి ) ఆత్రం భాస్కర్, ఐటీడీఏ క్రీడల అధికారి  కో రెడ్డి పార్థసారథి, జి సి డి ఓ  మిశ్రమ ఛాయా,  తొడసం దేవరావు తదితరులు పాల్గొన్నారు.