11 May, 2026 | 1:26 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

గాదె ఇన్నయ్యకు పితృవియోగం

01-03-2026 12:00 AM
  1. నెలన్నర వ్యవధిలో తల్లిదండ్రుల మృతి 
  2. నివాళులర్పించిన మాజీ మంత్రి హరీశ్‌రావు 

మహబూబాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): సామాజికవేత్త, తెలంగాణ ఉద్యమకారుడు, మావోయి స్టు మాజీ నేత గాదె ఇన్నయ్య తండ్రి సాల్మన్‌రెడ్డి (97) అనారోగ్యంతో మృతిచెందారు. జనగామ జిల్లా జాఫర్‌గడ్ మండలం సాగరం గ్రామంలో అనారోగ్యం, వయో భారంతో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఇన్నయ్య తల్లి థెరిసమ్మ గత నెల 15న మరణిం చారు. నెలన్నర వ్యవధిలో తల్లిదండ్రులను ఇన్నయ్య కోల్పోయారు. ఉపా చట్టం కింద ఇన్నయ్య ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.

తల్లి మరణించడంతో పెరోల్‌పై వచ్చి అంత్యక్రియలకు హాజరయ్యారు. తండ్రి మరణం తో మనోవేదనకు గురైన ఇ న్నయ్యను ప్రభుత్వం చొరవచూపి విడుదల చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.  మాజీ మంత్రి హరీశ్‌రావు సాగరం గ్రామానికి చేరుకొని సాల్మన్‌రెడ్డి భౌతిక కాయంపై పుష్పగుచ్చం  ఉంచి నివాళులర్పించారు. హరీశ్‌రావు వెంట మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయా కర్‌రావు, తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉన్నారు.