23 July, 2026 | 3:45 AM

అసైన్డ్ భూములకు పూర్తి భూమి హక్కును కల్పించాలి

23-07-2026 12:00 AM

జూలై 27న జరుగనున్న ధర్నాను విజయవంతం చేయాలి

ముషీరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): తెలంగాణలో పేదలకు, ముఖ్యంగా దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూములకు పూర్తి భూమి హక్కును ప్రభుత్వం వెంటనే కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం. బాల నరసింహ డిమాండ్ చేశారు. దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్ పిఎస్) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జూలై 27న కలెక్టర్ల వద్ద నిర్వహించే ధర్నా పోస్టర్ ను హిమత్ నగర్ లో రాజ్ బహదూర్ గౌడ్ హాల్లో బుదవారం విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కే. యేసు రత్నం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి వై ఉషశ్రీ, నాయకులు జేరుపోతుల కుమారస్వామి, కృపాకర్, శోభ, రేణుక తదితరులు పాల్గొన్నారు.