చట్టబద్ధమైన దత్తతతో పూర్తి ప్రయోజనాలు
మంచిర్యాల, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : చట్టబద్ధమైన దత్తత ప్రక్రియతో తల్లిదండ్రులుగా పూర్తి ప్రయోజనాలు పొందవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.ఎం.రాములు అన్నారు. గురువా రం కలెక్టరేట్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో జిల్లా మహిళా, శిశు సం క్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ’దత్తత కార్యక్రమాలు అండ్ ఫోస్టర్ కేర్’ పై అవగాహన జిల్లా స్థాయి సమావేశానికి జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనితలతో కలిసి హాజరై ఆయన మాట్లాడారు.
చట్టబద్ధ, చట్టవిరుద్ధ దత్తత మధ్య తేడాలను వివరించారు. చట్టబద్ధ దత్తత ప్రక్రియను సులభతరం చేయడానికి హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించడం జరిగిందని, వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడబ్ల్యుటీలు, ఆశా సూపర్వైజర్లు, దత్తత తల్లిదండ్రులు, డీసీపీయూ సిబ్బంది పాల్గొన్నారు.






