21 July, 2026 | 10:43 AM

స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన తోటి మిత్రులు

20-07-2026 10:00 PM

కల్లూరు,(విజయక్రాంతి): ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన చెన్నూరు గ్రామానికి చెందిన గండ్ర ఉపేంద్ర కుటుంబానికి ఆయన పదో తరగతి మిత్రులు అండగా నిలిచారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మిత్రులు కుటుంబ ఖర్చుల నిమిత్తం రూ.20000 నగదుతో పాటు రాబోయే ఆరు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు తల్లిదండ్రులకు అందజేరేశారు. అండగా నిలిచిన తోటి మిత్రులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.