6 June, 2026 | 10:09 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం

06-06-2026 08:50 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని బావుసాయిపేట గ్రామంలో సింధు పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఆరోగ్య సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఈ శిబిరంలో బైరగోని నందు గౌడ్, సింధు పిల్లల హాస్పిటల్ వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శిబిరానికి గ్రామస్థుల నుంచి విశేష స్పందన లభించింది.