ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి
10-03-2026 05:50 PM
కొమురవెల్లి,(విజయక్రాంతి): ప్రజా పాలన_ ప్రగతి ప్రణాళికలో భాగంగా కొమరవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ గొల్లపల్లి పద్మ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఉచిత వైద్య శిబిరాన్ని మండలం పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గ్రామంలోని ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు వైద్యులు పరీక్షలు చేసి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండల మెడికల్ అధికారి హరిత, పంచాయితీ కార్యదర్శి రాజు, ఉపసర్పంచ్ పోతిగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




