10 March, 2026 | 7:41 PM

స్వయంగా సమాధానం చేసిన కలెక్టర్

10-03-2026 05:47 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం ఐడీఓసీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ స్వయంగా పాల్గొని కార్యాలయ పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగిస్తూ శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.