13 May, 2026 | 4:42 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

ఆటోడ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం

03-03-2026 12:00 AM

భిక్కనూర్, మార్చి 2 (విజయ క్రాంతి): భిక్కనూర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి  వైద్య పరీక్షల శిబిరం సోమవారం నిర్వహించారు.  జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచనల మేరకు ఆరైవ్ అలైవ్  రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏఎస్పీ చైతన్య రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, ఆటో డ్రైవర్లు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

డాక్టర్ బాలు నాయక్ (కంటి వైద్య నిపుణులు, కామారెడ్డి) సహకారంతో సుమారు 100 మంది ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ సంపత్, భిక్కనూర్ ఎస్‌ఐ ఆంజనేయులు, బిబిపెట్ ఎస్‌ఐ విజయ్, రాజంపేట ఎస్ ఐ రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.