కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్
విధేయతకు పట్టం
సేవకు దక్కిన ప్రతిఫలం
మానకొండూరు,(విజయక్రాంతి): సెంట్రల్ సెన్సార్ అడ్వైజరీ ప్యానెల్ బోర్డు సభ్యునిగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లక్ష్మీపూర్ ఉపసర్పంచ్, భాజపా మానకొండూరు మండల మాజీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ నియామకమయ్యారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ రీజనల్ అధికారి డాక్టర్ రాహుల్ గౌలికర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
నియామకమైన తేదీ నుండి మూడు సంవత్సరాల పాటు సెన్సార్ బోర్డు సభ్యులుగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఈ గౌరవం మానకొండూరు మండలానికి రెండవసారి దక్కినట్లయింది. అంతకుముందు మానకొండూరు మండలం గంగిపల్లి ఎంపీటీసీ, భాజపా కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారికి ఈ అవకాశం దక్కింది.
సేవకు దక్కిన ప్రతిఫలం
2010 సంవత్సరంలో మాన కొండూరు మండల సంపర్క్ కేంద్ర కన్వీనర్ గా మొదలైన రాపాక ప్రవీణ్ ప్రస్థానం ప్రారంభమైంది. 2616 సంవత్సరంలో భాజపాలో చేరారు.2019 సంవత్సరంలో మండల భాజపా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కేవలం మూడు పదుల ప్రాయంలోనే పార్టీలో కీలక పదవులు నిర్వర్తించి ప్రస్తుతం సెన్సార్ బోర్డు మెంబర్ గా ఎన్నికయ్యారు.
తన నియమానికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి, గుర్రాల వెంకటరెడ్డి లకు ప్రవీణ్ తన కృతజ్ఞతలు తెలియజేశారు. అనతి కాలంలోనే సెన్సార్ బోర్డు మెంబర్ గా ఎన్నిక కావడం సేవకు దక్కిన ప్రతిఫలమని పార్టీ శ్రేణులు, అభిమానులు, హితులు స్నేహితులు, ప్రవీణ్ కు అభినందనలు తెలిపారు.






