ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు
బిజెపి సీనియర్ మహిళా నాయకురాలు: బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను సమానంగా చూడటం లేదని బిజెపి సీనియర్ నాయకురాలు బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి ఆరోపించించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లిం సోదరులకు 10,000 చొప్పున ఇవ్వడం జరిగిందని దేవుడి దర్శనం కోసమే కాబట్టి ఆనందకరమైన విషయమని ఆమే అన్నారు.
అదేవిధంగా మన రాష్ట్రం నుండి హాజ్ యాత్రకు 7000 మంది వెళ్తున్నారంటే సుమారు 7 కోట్ల రూపాయలు అవుతాయని కృష్ణప్రియ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల డబ్బును కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంపాదించినట్లు ఖర్చు చేస్తున్నారని ఆమే మండిపడ్డారు. మేడారం జాతర సమయంలో టిఎస్ ఆర్టిసి హైదరాబాద్ నుండి 600 ఉన్నటువంటి టికెట్ రేట్ ను 1110కి, వరంగల్ కు 250 ఉన్నటువంటి టికెట్ ధరను 500 పెంచి,
మహబూబాబాద్ 360 ఉన్నటువంటి టికెట్ ధరను 410కి పెంచి, తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్లలో రేట్లు పెంచి మేడారం జాతరకి వెళ్లే గ్రామంలో ఎందుకని అలా ప్రజలపై భారం మోపారని కృష్ణప్రియ మల్లారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమానంగా చూడకపోవడమే కాకుండా తేడా చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు.






