విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం
ట్రివియల్ చాప్టర్ సంస్థకు చెందిన ఇద్దరి అరెస్ట్
జూబ్లీహిల్స్, ఏప్రిల్ 13(విజయక్రాంతి): విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న భారీ ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ట్రివియల్ చాప్టర్ అనే సంస్థ పేరుతో నిందితులు మోసానికి పాల్పడ్డారన్నారు. యూరప్ దేశాలైన గ్రీస్, రొమేనియా, ఇటలీలో వర్క్ వీసాలు ఇప్పిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారన్నారు, బాధితులు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 50వేల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు.
ఈ కేసుకు సంబంధించి సంస్థ వైస్ ప్రెసిడెంట్ లంక నిరుపమ, రీజినల్ మేనేజర్ మామిడి అరుణ్ రాజ్లను అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ సహా మరో ఎనిమిది మంది కోసం గాలింపు చర్యలు చేపట్టా మని వెల్లడించారు. నిందితులు ఎలాంటి అధికారిక రిక్రూట్మెంట్ లైసెన్స్ లేకుండానే ఆన్లైన్ టెంప్లేట్ల ద్వారా నకిలీ ఆఫర్ లెటర్లు, వర్క్ ఆథరైజేషన్ పత్రాలను సృష్టించి బాధితులను మోసగించినట్లు విచారణలో తేలిం దన్నారు.
గతంలోనూ ఈ సంస్థ కేపీహెచ్బీ పరిధిలో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు గుర్తు చేశారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమ త్తంగా ఉండాలని కోరారు. అధికారిక ఈ-మైగ్రేట్ పోర్టల్ ద్వారా వివరాలను సరిచూసు కోవా లని సూచించారు. నిరుద్యోగులు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ప్రకటనలను నమ్మి మోసపో వద్దని హెచ్చరించారు.






