calender_icon.png 12 February, 2026 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి

12-02-2026 06:59:33 PM

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్

జిల్లా కార్యవర్గ సభ్యులు టి శంకర్

జవహర్ నగర్,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కర్షకులకు ఒప్పంద కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీటీసీ టి. శంకర్ పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి దర్శనం యాదగిరి ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మె సందర్భంగా గురువారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో ఏఐటియుసి సిఐటియు సంఘాలు సమ్మెలో పాల్గొని నిరసన తెలిపాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టి శంకర్ హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతనను ఇవ్వాలని కార్మికులకు ఎనిమిది గంటల పని దినాలను కొనసాగించాలని, తెలిపారు. దేశంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 25000 ఇవ్వాలని కంపెనీలే పనిచేసే కార్మికులకు ఎనిమిది గంటల పని దినాలను కొనసాగించాలని తెలిపారు.

గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా విజయవంతమైనందుకు ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులకు సబ్బండ వర్గాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగేష్ సిఐటియు నాయకులు శ్రీమన్నారాయణ ఏఐటీయూసీ నాయకులు అంబాల ఎల్లయ్య గిరిజన సమాఖ్య నాయకురాలు శ్యామలత ప్రధాన కార్యదర్శి వి స్వరూప కొండ సత్యం సాగర్, సిహెచ్ ఎల్లయ్య శ్యాం దాస్ కోదాసు జయమ్మ మల్లిక నగేష్ సతీష్ శ్రీను నర్సింగ్ అశోక్ తదితరు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.