17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కదిరిలో ఘోర ప్రమాదం: గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురు మృతి

15-04-2026 02:25 PM

పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో(Satya Sai district) బుధవారం గ్యాస్ సిలిండర్లు, డిటోనేటర్లు పేలి నలుగురు మరణించారని పోలీసులు తెలిపారు. ఓ కూలీ నివాసంలో నిల్వ ఉంచిన 4 డిటోనేటర్లు పేలి ప్రమాదం సంభవించింది. ఇంట్లో ఉన్న డిటోనేటర్లు పేలి గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నాయి. డిటోనేటర్లు, సిలిండర్లు పేలి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో 21 మందికి గాయాలు కాగా, ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

జిల్లాలోని కమ్మరవారిపల్లి గ్రామంలో సిలిండర్ల పేలుడు ధాటికి ఐదు ఇళ్లు కూలిపోయాయని పోలీసు సూపరింటెండెంట్ ఎస్. సతీష్ తెలిపారు. "కదిరి మండలంలోని కమ్మవారిపల్లి గ్రామంలో మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో నలుగురు మరణించారు," అని సతీష్ తెలిపారు. పేలుడు సంభవించిన ఆ ఇంట్లో తెలంగాణకు చెందిన కార్మికులు నివసిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.