3 July, 2026 | 11:32 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

నకిరేకల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

01-01-2026 12:19 AM

పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, డిసెంబర్ 31(విజయ క్రాంతి):  నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నూతనంగా నిర్మించనున్న డ్రెయినేజీ నిర్మాణ పనులకు  నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం శంకుస్థాపన చేశారు. డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ నకిరేకల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో డ్రైనేజీ, సీసీ రోడ్ల పనుల నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేశామని, నకిరేకల్  పట్టణంను దశల వారిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

పట్టణంలోని సిసి రోడ్డు, డ్రైనేజీ పనుల నిర్మాణం కోసం 6 కోట్లు తో పనులు ప్రారంభించామని,100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభిస్తున్నాం అని పేర్కొన్నారు. ఆసుపత్రిలో ట్రామ కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్ కూడ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ కార్యాలయాలకు త్వరలో శంకుస్థాపన చేస్తామని, పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు.

నకిరేకల్ పట్టణంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, ఇంటిగ్రేటెడ్  స్కూల్ ను త్వరలో నిర్మాణం చేపడుతాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత - శ్రీనివాస్,మాజీ వైస్ చైర్మన్ మూరారిశెట్టి ఉమారాణి - కృష్ణమూర్తి, కమీషనర్,మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.