18 July, 2026 | 1:10 AM

గడువులోగా ఫారాలు అందజేయాలి

18-07-2026 01:00 AM

తహసీల్దార్ శ్రీకాంత్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూలై 17: సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు ఎన్యూమరేషన్  దరఖాస్తు ఫారాలను గడువులోగా బాధ్యతగా అందజేయాలని తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ అన్నారు.శుక్రవారం మండలంలోని తిమ్మాపురం,కొమ్మాల గ్రామాల్లో జరుగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాలు ఈసీఐలో పొందుపరిచే విధానాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎల్‌ఓలు ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా,నిబంధనల ప్రకారం పని చేస్తూ ఓటర్లు పత్రాలను నింపడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు.ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ కుంటిగొర్ల శ్రీను,ఆర్‌ఐ పాటి వెంకట్ రెడ్డి,బీఎల్వోలు బొడ్డు పరమేశ్వరి,జీడి రాధ,జీడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.