10 April, 2026 | 3:06 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు అబద్ధ్దాల పుట్ట

10-04-2026 01:17 AM

వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి నీకు?

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 9(విజయక్రాంతి): ఉద్యమ సమయంలో రూ.10 వేల కోసం కూడా కష్టపడ్డ హరీశ్‌రావు, ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాలంలో హరీశ్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక అరాచకాలకు పాల్పడ్డారని, భూముల కబ్జాలకు కూడా కారణమయ్యారని ఆరోపించా రు. గత పదేళ్లలో ఫార్మ్ హౌస్‌లు, గెస్ట్ హౌ స్‌లు, కమర్షియల్ భూములు అన్నీ హరీశ్‌రావు కుటుంబానికి సంబంధించినవేనని అన్నారు. ప్రజల ముందుకు వచ్చి తన ఆస్తులపై పూర్తి లెక్కలు వెల్లడించాలని సాయికు మార్ డిమాండ్ చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో హరీశ్‌రావు శాఖల్లో జరిగిన అవినీతిని బయటపెడితే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.

మాజీ సీఎం తర్వాత అత్యంత అవినీతి పరుడు హరీశ్‌రావేనని ఆరోపించారు. మెదక్‌లో రఘునందన్ రావు గెలవడానికి, బీజేపీతో బీఆర్‌ఎస్ ములాకత్‌కి కారణం హరీశ్‌రావే అని సాయికుమార్ పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత హరీష్‌రావుకు లేదని, తరచూ మాట్లాడటం వల్ల ఆయనకు మతి పోతుందని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్ పాలనపై గన్‌పార్క్ వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను విస్మరించి నందుకే బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి పాలైందని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు.