9 July, 2026 | 11:08 PM

ఇంటికి చేరిన మాజీ మావోయిస్టు జాడి పుష్ప

09-07-2026 04:31 PM

ఊరంతా స్వాగతం.. చంద్రవల్లిలో సందడి

బెల్లంపల్లి, (విజయక్రాంతి): పోలీసులకు సాయిదంగా లొంగిపోయిన మావోయిస్టు జాడి పుష్ప(Former Maoist Jadi Pushpa) ఎట్టకేలకు ఇంటికి చేరింది. ఈ సందర్భంగా ఆమెకు కుటుంబ సభ్యులతో సహ ఊరంతా స్వాగతం పలికి ఆలింగనం చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవల్లి గ్రామానికి చెందిన జాడి వెంకటి, పుష్ప దంపతులు 20 ఏళ్ల క్రితం అడిబాట పట్టారు. అలుపెరగని సాయిధ పోరాటంలో జాడి వెంకటి కగార్ ఆపరేషన్ లో ఇటీవలనే మరణించారు. భర్త జాడి వెంకటి తన కళ్ళముందే మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటనతో తీవ్ర కలత చెందింది. దీంతో జాడి పుష్ప కొంతకాలమే విప్లవోద్యమంలో కొనసాగింది.

అనారోగ్య బారిన పడిన ఆమె ఇటీవలనే మూడు నెలల క్రితం సెక్స్ చతిస్గడ్ లో గరియాబంద్ లో  పోలీసులకు ఆయుధాలతో లొంగిపోయారు. తన సహచరురాలు అంజుతో కలసి జాడి పుష్ప ఇవాళ ఇంటికి చేరుకుంది. ఆమె రాకతో చంద్రవెల్లి గ్రామంలో సంతోషం వెళ్లి విరిసింది. గ్రామ పొలిమేర్ల కు వెళ్లి జాడి పుష్ప కు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు స్వాగతం పలికారు. పూలమాలలు వేసి సత్కరించి డప్పు చప్పుళ్లతో ఆమెను ఇంటికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉద్యమంలో భర్త జాడి వెంకట్ తో కలిసి వెళ్లిన ఆమె ఒంటరిగా ఇంటికి చేరుకోవడం ఒక విషాదంగా మిగిలిపోయింది.

నమ్మిన ఆశయం కోసం జాడి వెంకటి పోరుబాట వీడలేదు. చివరికి నెత్తురు చిందించాడే తప్ప ఉద్యమాన్ని వీడలేదు. ఆయనతో వెళ్లిన భార్య జాడి పుష్ప మాత్రం అనూహ్యంగా పోలీసులకు లొంగిపోయి ప్రాణాలతో ఇంటికి చేరారు. జాడి పుష్ప ఇంటికి రావడం ఆ రెండు కుటుంబాల్లో సంతోషానికి అవధులు లేకుండా పోయింది. జాడి పుష్ప రాకతో చంద్రవల్లి గ్రామంలో సందడి నెలకొంది. గ్రామస్తులు బంధుమిత్రులు ఆమెను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విప్లవోద్యమాన్ని వీడిన జాడి పుష్ప చంద్రవల్లిలోనే కుటుంబ సభ్యులతో తన జీవనాన్ని కొనసాగించనున్నది. ప్రాణాలతో  తమ గ్రామం బిడ్డ జాడి పుష్ప ఇంటికి రావడంతో ఉపిరి పీల్చుకున్నారు.