తప్పుడు ఓట్లను నిబంధనల ప్రకారం తొలగించాలి
సుల్తానాబాద్ తాహసిల్దార్ బషీరుద్దీన్
సుల్తానాబాద్, జూలై 9 (విజయ క్రాంతి): తప్పుడు ఓట్లను నిబంధన ప్రకారం తొలగించాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తాసిల్దార్ బషీరుద్దీన్ బిఎల్ఓ లకు సూచించారు,గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో 3.4,5,6,8.15 వార్డులలో (ఎస్ ఐ ఆర్) ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ జాబితా సర్వే ప్రక్రియను మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు కృష్ణ , సుల్తానాబాద్ తాసిల్దార్ తో కలిసి వైశ్య భవన్ , పద్మనాయక కల్యాణ మండపం, దుబ్బలపల్లి స్కూలు .ఎస్సీ కాలనీ. ప్రైమరీ స్కూల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని సందర్శించడం జరిగింది, ఈ సందర్భంగా తాసిల్దార్ బషీరుద్దీన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, తప్పుడు ఓట్లను నిబంధనల ప్రకారం తొలగించాలని, సర్వేలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా గడువులోగా పూర్తి చేయాలని బి ఎల్ ఓ లకు సూచించడం జరిగింది , ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






