9 July, 2026 | 11:09 PM

తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయినట్లే: కేటీఆర్

09-07-2026 05:22 PM

కాంగ్రెస్ పార్టీ పతనం పతనం  దాదాపు ఖాయం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్(Greater Hyderabad BRS leaders) నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) పని అయిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత సర్వేలోనే తేలిందని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం తన పరిపాలన, నాయకత్వంపై సర్వే చేయించుకున్నారని సూచించారు. ఆ సర్వేలో కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తమైందని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 78 సీట్లు గెలుస్తోందని సీఎం సర్వేలో తేలిందన్నారు. మీడియా, ఇంటెలిజెన్స్ విభాగాల ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం వ్యక్తంమైందని తెలిపారు.

కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ను మరోసారి సీఎంగా చూడాలనుకుంటున్నామని ప్రజలు చెప్పారని పేర్కొన్నారు. సొంత సర్వేలో వచ్చిన ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక సీఎం అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైందని కేటీఆర్ చమత్కరించారు. ప్రజలు కాంగ్రెస్ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని వివరించారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ, ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరని సూచించారు. కాంగ్రెస్ పార్టీ జారుడు బండపైన నిలబడిందన్న కేటీఆర్ పుంజుకునే అవకాశమే లేదన్నారు. కాంగ్రెస్ ఇకపై ప్రజామోదం పొందడం అత్యంత కష్టమని పేర్కొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా మందకొడిగా ఎస్ఐఆర్ కార్యక్రమం

రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్(Special Intensive Revision) కార్యక్రమం మందకొడిగా సాగుతోందని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ పరిధిలో ఎస్ఐఆర్(SIR) ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. బీఎల్ఓలకు సరైన శిక్షణ, తగిన ఏర్పాట్లు లేవన్నారు. ఎస్ఐఆర్ లో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. బీఎల్ఏల సహకారంతో ఎవరి ఓటూ పోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్(BJP, Congress) డబుల్ ఓట్ల నమోదు చేయించే ప్రయత్నాలు చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ మద్దతుదారుల ఓట్లు పోయేలా చేసే అవకాశం ఉందని ఆరోపించారు.