9 July, 2026 | 11:09 PM

విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

09-07-2026 06:29 PM

రుద్రంగి జులై 09(విజయక్రాంంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని దసరా నాయక్ తండాలో శ్రీ జగదాంబ మేరమ్మ యాడి శ్రీ సంతు సేవలల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. తండా ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం గ్రామ పెద్దలు, నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనుల ఆధ్యాత్మిక సంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు,తండా ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.