పోసానిపేటలో వన మహోత్సవం
29-08-2026 10:36 PM
రామారెడ్డి,(విజయక్రాంతి): రామారెడ్డి మండలం పోసానిపెట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మోహన్, శ్రీనివాస్, సునీతతో పాటు బీట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుద్దాల లింగం, మాజీ సర్పంచ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గీ రెడ్డి మహేందర్ రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు కే. గంగారం, పోతుల బాపురెడ్డి, బండి పోచయ్య, బండి తిరుపతి, సాకలి సాయిలు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోత్స్న ప్రశాంత్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






