calender_icon.png 23 February, 2026 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృక్షాల నరికివేతపై అటవీ శాఖ స్పందించాలి

23-02-2026 08:21:47 PM

మణుగూరు,(విజయక్రాంతి): ఏరియాలో నిద్రమాను వృక్షాల నరికివేత పై అటవీ శాఖ స్పందించాలని సామాజిక సేవకులు కర్నే బాబురావు డిమాండ్ చేశారు. సోమవారం  జిల్లా ఫారెస్ట్ ఏవో కెఎస్ఎన్ మూర్తికి ఫిర్యాదు చేసినట్లు  బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు సింగరేణి ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో  సుమారు 50 ఏళ్ల వయసున్న వృక్షాలను ఎలాంటి అనుమతులు లేకుండా  నరకించిన వారి పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విష యంపై అటవీ శాఖ స్పందించకపోతే   గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించనున్నట్లు తెలిపారు అంతేకాకుండా పీవీ కాలనీలో అనుమతి లేకుండా నరికించిన  ఇతర వృక్షాలపై కూడా విచారణ జరిపించి చెట్లను రక్షించాలని  పర్యావరణ పరిర క్షణ తగు చర్యలు చేపట్టాలని కోరారు.