28 June, 2026 | 4:06 PM

Breaking News

తహసీల్దార్ భవన నిర్మాణానికి 2 కోట్ల 25 లక్షలు మంజూరు   •   లింగాపురం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం   •   పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •  

అన్నం పరబ్రహ్మ స్వరూపం

13-04-2026 08:27 PM

యువ సంకల్ప ఫౌండేషన్ కోశాధికారి తుమ్మ వెంకటేశం

సుల్తానాబాద్,(విజయక్రాంతి): అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్  యువ సంకల్ప ఫౌండేషన్ కోశాధికారి తుమ్మ వెంకటేశం అన్నారు, సోమవారం సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తమ్ముడు తుమ్మ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.

అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానం అనే సంకల్పంతోటి మా యువ సంకల్ప ఫౌండేషన్ను నడుపుతున్నామని మా ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలుస్తున్నామని అలాంటి సంస్థ నడిపే మా తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పట్టణంలోని దివ్యాంగులైన చిన్నారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు,  ఎవరి పుట్టినరోజు అయిన హంగులు ఆడంబరాలు చేయకుండా ఆకలితో ఉన్న వారికి ఒకరికైనా  కడుపునిండా భోజనం పెట్టాలని పిలుపునివ్వడం జరిగింది.