5 March, 2026 | 1:32 PM

చిన్నక్క ఆశయాలు అజరామరం

05-03-2026 12:03 PM

ఆమె ఆశయ సాధనకు ఉద్యమిద్దాం.

 కుంజ చిన్నక్క  వర్ధంతి సభలో ... మచ్చ వెంకటేశ్వర్లు, 

చర్ల:  (విజయక్రాంతి): మాజీ వైస్ ఎంపిపి, సిపిఎం మండల కమిటీ సభ్యురాలు అమరజీవి కుంజ చిన్నక్క ఆశయాల సాధనకు ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  కుంజ చిన్నక్క ఆరవ వర్థంతి ఆర్ కొత్తగూడెం సెంటర్లో కారం నరేష్ అద్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ జెండా ఆవిష్కరించారు, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు కుంజ చిన్నక్క స్మారక స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కుంజ చిన్నక్క సిపిఎం పార్టీ నిర్వహించిన అనేక ప్రజా పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు, పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశారని అన్నారు, ఆర్ కొత్తగూడెం ఎంపీటీసీ గా గెలుపొంది చర్ల మండల ఉపాధ్యక్షురాలుగా ఆదర్శవంతంగా నీతి నిజాయితీగా  ప్రజా సేవ చేసిన గొప్ప నాయకురాలని ఆయన కొనియాడారు, చిన్ననాటి నుంచి చిన్నక్కకు సిపిఎం పార్టీ పట్ల అమితమైన ప్రేమ, గౌరవం ఉండేదని అన్నారు ,డబ్బుకు, పదవులకు లొంగని క్రమశిక్షణ కలిగిన నాయకురాలని అన్నారు, అనారోగ్యంతో ఆమెను కోల్పోవడం పార్టీకి, కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు,ఆమె మరణించినా చిన్నక్క ఆశయాలు అజరామరమని ఆమె చూపిన మార్గంలో ఉద్యమాలు నిర్వహిండమే చిన్నక్కకిచ్చే ఘన నివాళి అని అన్నారు,

 కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ గ్రామ,గ్రామాన ఆందోళనలు 

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికులకు,రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదలందరికీ వ్యతిరేకంగా కొత్త చట్టాలను తీసుకువచ్చిందన్నారు, కార్మిక చట్టాలను రద్దు చేసి,నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చారని, నూతన విద్యుత్ చట్టాన్ని తీసుకువచ్చి ప్రజలపై భారాలు మోపుతుందన్నారు, అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏకపక్షంగా రద్దు చేసి కొత్తగా వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజివిక మిషన్ గ్రామీణ (వీబీ జీ రామ్ జ) తీసుకు వచ్చిందని విమర్శించారు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాలను కార్పోరేట్ల ప్రయోజనం కోసం  తీసుకు వచ్చిందని విమర్శించారు.

బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని కేంద్ర కమిటీ పిలునిచ్చిందని, కార్యకర్తలంతా గ్రామాల్లో పర్యటించి ప్రజలను చైతన్యం చేయాలన్నారు, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా కనీస మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో సిపిఎం మండల  కార్యదర్శి మచ్చ రామారావు,మండల కమిటీ సభ్యులు కారం నరేష్, దొడ్డి హరినాగవర్మ,పొడుపుగంటి సమ్మక్క,,బి.నవీన్,బందెల చంటి, వరలక్ష్మి,షారోని, అఖిల్, శ్వేత,కుంజ వెంకటేశ్వర్లు, మూర్తి, శ్యామల వెంకటేశ్వర్లు,కట్టం స్పందన తదితరులు పాల్గొన్నారు.