26 April, 2026 | 10:23 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

జవాన్ల కాన్వాయ్‌పై కాల్పులు

20-09-2025 12:36 AM
  1. ఇద్దరు సైనికులు మృతి, ఐదుగురికి గాయాలు
  2. మణిపూర్‌లో ఘటన

ఇంఫాల్, సెప్టెంబర్ 19: మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్ వస్తున్న అస్సాం రైఫిల్స్‌కు చెందిన భద్రతా దళాల వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం కాల్పులు జరిపారు. ఈ దాడి సమ యంలో వాహనంలో 33 మంది సైనికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెం దగా.. మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారు.

ఈ దాడి హేయమైన చర్యగా మణి పూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా అభివర్ణించారు. దాడిని ఖండిస్తూ ఎక్స్‌లో మృ తుల కుంటుంబాలకు సంతాపం తెలిపారు. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాజీ సీఎం బీరేన్ సిం గ్ కూడా జవాన్లపై దాడిని ఖండించాడు.