20 May, 2026 | 7:56 PM

టిప్పర్ లారీలో చెలరేగిన మంటలు

20-05-2026 06:31 PM

డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాట్నపల్లి మధ్యలో రాజీవ్ రహదారి పైన షార్ట్ సర్క్యూట్ తో టిప్పర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. బుధవారం సుల్తానాబాద్ మండలంలోని కోదురుపాక నుండి కాట్నపల్లి ఇటుక బట్టీలకు మట్టి లోడుతో వెళుతున్న లారీ ఎండ వేడితో ఓవర్ హిట్ కారణంగా ప్రమాదవశాత్తు  క్యాబిన్లో  షార్ట్ సర్క్యూట్ అయి లారీ క్యాబిన్ భాగం పూర్తిగా దగ్ధమైంది.

సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని సిబ్బంది మంటలను ఆర్పి వేసింది, రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ స్తంభించగా హుటా హుటిన  స్థానిక ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు చేరుకొని  మంటలను ఆర్పేందుకు సహాయ చర్యలు చేపట్టడంతో పాటు, ట్రాఫిక్ ను క్లియర్ చేశారు, దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు, అలాగే మంటలను ఆర్పేందుకు గాను సిఐటియు మండల కన్వీనర్ తాండ్ర అంజయ్య, ఉపాధ్యక్షుడు వీరగోని కిరణ్ గౌడ్, గుమస్తాల సంఘం అధ్యక్షులు రాయమల్లు లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.