24 April, 2026 | 12:04 PM

Breaking News

అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి   •  

పరుపుల పరిశ్రమలో అగ్నిప్రమాదం

21-11-2025 01:01 AM

ఘట్ కేసర్, నవంబర్ 20 : మేడ్చల్ జిల్లా, ఘట్ కేసర్ మున్సిపల్ అవుషాపూర్  కేపాల్ వద్ద గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న పరుపులు, సోఫా సెట్ ల తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగి ఒక్కసారిగా మంటలు రేగి దట్టమైన పొగలతో ఆకాశమంత ఆవరించింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అర్పించారు.  ప్రమాదానికి కారణం, ఎంత నష్టం జరిగింది తెలియాల్సి ఉంది.