7 March, 2026 | 12:25 PM

సోమాజిగూడలో అగ్నిప్రమాదం

07-03-2026 10:22 AM

హైదరాబాద్: సోమాజిగూడలో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం(Fire breaks out) సంభవించింది. రాజ్ భవన్ రోడ్డులోని(Raj Bhavan Road) ఒక వైన్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేయగలిగారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు సంభవించాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.