పంత్‌కు జరిమానా
ముంబై, మే 16 : చెన్నై సూపర్‌కింగ్స్‌పై గెలిచి జోష్ మీదున్న లక్నో సూపర్‌జెయిం ట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు షాక్ తగిలింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ పంత్పే బీసీసీఐ క్రమశి క్షణా చర్యలు తీసుకుంది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రిషబ్ పంత్ కు రూ.12 లక్షల జరిమానా విధించింది.
ఐపీఎల్ ప్రవర్తన నియ మావలిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం కనీస ఓవర్ రేట్ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ల క్నో సూపర్ జెయింట్స్‌కు ఈ సీజన్‌లో ఇది మొదటి తప్పిదం కావడంతో కేవలం కెప్టెన్‌కు మాత్రమే రూ.12 లక్షల జరిమానా తో సరిపెట్టారు. ఒకవేళ ఇదే తప్పు మళ్లీ పునరావృతమైతే జరిమానా మొత్తం రెట్టింపు అవడంతో పాటు పాటు జట్టులో ని మిగిలిన సభ్యులకు కూడా మ్యాచ్ ఫీజు లో కోత విధిస్తారు.






