13 August, 2026 | 9:40 AM

‘శ్రీసంపర్క్’తో ఆర్థిక భరోసా

13-08-2026 12:49 AM

తెలంగాణ వస్త్ర పరిశ్రమకు ఊతం

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాం తి): తెలంగాణ టెక్స్‌టైల్స్, గార్మెంట్ పరిశ్రమ అభివృద్ధి కోసం శ్రీరామ్ ఫైనాన్స్ లి మిటెడ్ ‘శ్రీసంపర్క్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 100కు పైగా కంపెనీల ప్రతినిధులు, పరిశ్రమ నిపుణులు హాజరయ్యా రు.

తెలంగాణ చేనేత, జౌళి అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీవెంకట రమణ ముఖ్య అతిథిగా, తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం అసిస్టెంట్ డైరెక్టర్ (ఫైనాన్స్) జె. కాళింగరెడ్డి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ బిజినెస్ హెడ్ (తెలంగాణ) వి. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. వ్యాపార యజమానులకు విజ్ఞానం, నెట్వర్కింగ్, ఆర్థిక సాధి కారత అందించడమే ‘శ్రీసంపర్క్’ లక్ష్యమని తెలిపారు. పరిశ్రమ నిపుణులు భవిష్యత్ వృద్ధి అవకాశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.