16-02-2026 12:00:00 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, ఫిబ్రవరి 15 (విజయ క్రాంతి): సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా పండుగలు నిలుస్తాయని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గంగాధర మండలం కొండన్నపల్లి సహస్ర లింగేశ్వర ఆలయంలో నిర్వహించిన మహాశివరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివుని ఆశీర్వాదంతో చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని నియోజకవర్గ ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్,సర్పంచ్లు సంఘం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, సర్పంచులు రెండ్ల శ్రీనివాస్, కాడరి హారిక కనుకయ్య, వేముల భాస్కర్,పడాల భాగ్యలక్ష్మి రాజన్న ,రామిడి రాజిరెడ్డి, సాగి అజయ్ రావు,తూం రాజు, వేముల అంజి,చందు ,మేర్జ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.