21 August, 2026 | 2:46 PM

టేకులపల్లిలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం పూజలు

21-08-2026 01:32 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండల వ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచే మహిళలు ఇళ్లను శుభ్రం చేసి, ప్రత్యేక పూజా ఏర్పాట్లు చేసుకుని వరలక్ష్మీ దేవిని అలంకరించి పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, పూలతో అమ్మవారిని అలంకరించి, దీపారాధన, నైవేద్యాలు సమర్పించి వ్రతాన్ని ఆచరించారు. ముత్తైదువులను పిలిచి వాయనాలు అందజేసి, కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. పలు ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు, అమ్మవారి అలంకరణలు నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వరలక్ష్మీ దేవిని దర్శించుకున్నారు. వ్రతం సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.