21 August, 2026 | 2:45 PM

మంత్రి శ్రీధర్ బాబు చొరవతో రాజయ్యకు వైద్య సహాయం

21-08-2026 01:24 PM

ముత్తారం, ఆగస్టు 21 (విజయ క్రాంతి): అనారోగ్యంతో బాధపడుతున్న ముత్తారం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన రామగాళ్ల పెద్ద రాజయ్యకు వైద్య చికిత్స కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామగాళ్ల పెద్ద రాజయ్య వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించాలని మంత్రి శ్రీధర్ బాబును కోరారు. స్పందించిన మంత్రి వెంటనే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు.

మంత్రికి సంబంధించిన హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో ఆయన ఆస్పత్రి సహాయకులు ఎల్‌ఓసీ పత్రాన్ని రాజయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. అనారోగ్య సమయంలో ఆర్థికంగా అండగా నిలిచి వైద్య చికిత్సకు సహాయం అందించిన మంత్రి శ్రీధర్ బాబుకు రాజయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పేదల వైద్యానికి అండగా నిలుస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్స సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా మంత్రి శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.