నూతన కమిషనర్‌కు సన్మానం
05-05-2026 02:18 AM
మేడ్చల్ అర్బన్, మే 4(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపల్ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎన్.కృష్ణారెడ్డిని వివిధ పార్టీల నాయకులు, చైర్ పర్సన్, కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలిపి శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్, వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, కౌన్సిలర్స్ వాచ్ పల్లి అర్చన శ్రీనివాస్ తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి, కౌన్సిలర్లు బిజెపి నాయకుడు శ్రీశైలం యాదవ్,రాజు నాయక్, నాయకులు పోచయ్య, ఆంజనేయులు, ముదిరాజ్ ,ప్రధాన కార్యదర్శులు కంచుగంట మహేష్, దాది ప్రకాష్ ముదిరాజ్, జీవన్ నాయక్, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.






