మేడ్చల్‌లో బీజేపీ సంబరాలు
మేడ్చల్, మే 4 (విజయక్రాంతి): 3 రాష్ట్రాలలో బీజేపీ విజకేతనం ఎగురవేసిన సందర్భంగా మేడ్చల్లో బీజేపీ నాయకులు స్వీట్స్ తినిపించుకొని బాణసంచా కలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశంలో మోడీ నాయకత్వములో బీజేపీ కి మద్దతు ఇస్తున్న దేశ ప్రజలు మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మోడీ పాలనలో ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడం, ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కల్పించడం ద్వారా దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు నమ్మి చాలా చాలా రాష్ట్రాలలో మోడీ ని గెలిపిస్తున్నారు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమములో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు పాతూరి ప్రభాకర్ రెడ్డి, లవంగ శ్రీకాంత్,పాతూరి సుధాకర్ రెడ్డి, జాకాట ప్రేమ దాస్, మైసరి రాజు, రాఘవ రెడ్డి,ధాత్రిక లక్ష్మణ్, సత్యనారాయణ రెడ్డి, చిర్ల సత్యనారాయణ, హేమలత రెడ్డి, అర్జున్, కృష్ణ ప్రియ మల్లారెడ్డి, గోపు నాగరాజు, రామచంద్ర రెడ్డి, గౌలికర్ మహేష్, సాయికుమార్, సురేందర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, రతన్ రాథోడ్, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, నర్సింగ్ రావు, మహేందర్, నరేందర్, భారత్, కేశవరెడ్డి, పురుషోత్తం, రవి, రాజు పాల్గొన్నారు.






