23 May, 2026 | 9:54 PM

యాదాద్రి పరిరక్షణ సమితి, బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

23-05-2026 08:59 PM

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా 

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట అభివృద్ధి కార్యక్రమాలకు  సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్బంగా యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులను, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు . ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొండపైన 50, 60 సంవత్సరాలుగా వర్తకం తో వ్యాపారాలు నిర్వహించి ఉంటూ  లబ్ధి పొందుతున్నారని కొత్తవారికి అవకాశం లేకుండా దేవస్థానానికి ఆదాయం రాకుండా ఉద్యోగులను రాజకీయ నాయకులను గుప్పెట్లో పట్టుకున్నారని వాళ్లు చెప్పిందే వేదంగా నడుస్తుందని, కొండ కింద భూ నిర్వాసితుడు నిరుద్యోగులు ఎంతోమంది ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్నారని కొండపైన దుకాణాలను వేలం వేస్తే ఎంతోమందికి లబ్ధి జరుగుతుందని ఈ విషయమై గత నెల రోజులుగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందని,  వర్తక సంఘము  వ్యాపారులకు ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉండడంతో వాళ్లు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారు.