ఆచార్య కలవకుంట రామకృష్ణ కు సత్కారం
ముకరంపుర,(విజయక్రాంతి): స్థానిక ఎస్సారార్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కలవకుంట రామకృష్ణకు చైతన్య సారస్వత పరిషత్తు, శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6, 7 తేదీలలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రిలో నిర్వహించిన ఏడవ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల్లో సాహిత్య బంధు పురస్కారం ప్రకటించారు. ఈ పురస్కారాన్ని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్, మాజీ ఎమ్మెల్సీ కెవివి సత్యనారాయణ రాజు, శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణంల చేతుమీదుగా ఆచార్య కలవకుంట రామకృష్ణ ఈ సాహితీ బంధు పురస్కారాన్ని స్వీకరించారు. వీరు రచించిన కవితా సంపుటాలు హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువాదం చేయబడ్డాయి .తెలుగును జాతీయస్థాయిలో వెలిగిస్తున్న కలువకుంట రామకృష్ణకు ఈ అవార్డు రావడం కరీంనగర్ జిల్లాకు,కళాశాలకు గర్వకారణమని కళాశాల స్టాఫ్ క్లబ్ పక్షాన కలువకుంట రామకృష్ణ కు కళాశాలలో ఘనంగా అభినందన సత్కారం చేశారు.






