14 June, 2026 | 3:01 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలి

14-06-2026 12:00 AM
  1. నెలకు రూ.500 కోట్ల చొప్పున రిలీజ్ చేయాలి
  2. జీవో నెం.7 రద్దుతో ఏర్పడిన గందరగోళంపై ప్రభుత్వం ప్రత్యేక విధాన ప్రకటన చేయాలి
  3. లక్షలాది మంది బీసీ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు
  4. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం

ముషీరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయిం బర్స్మెంట్ పథకానికి సంబంధించి గతంలో అమలులో ఉన్న జీవో నెం.7 రద్దు అనంతరం ఏర్పడిన గందరగోళ పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే స్పష్టతనిస్తూ ప్రత్యేక వి ధాన ప్రకటన విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షు లు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెం.7 రద్దు తరువాత ఫీజు రీయింబర్స్మెంట్ అర్హతలు, చెల్లింపుల విధానం, పెండింగ్ బకాయిల పరిష్కారం వంటి అంశాలపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించకపోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు తీవ్ర అయోమయంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారని,  విధానపరమైన స్పష్టత లేకపోవడం వల్ల వారి విద్యా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అనేది కేవలం సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదని, పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యను అందు బాటులోకి తీసుకువచ్చిన సామాజిక న్యా య పథకమని పేర్కొన్నారు.

అదే విధంగా రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పూర్తిగా చెల్లించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, నెలకు కనీసం రూ.500 కోట్ల చొప్పున విడతల వారీగా విడుదల చేసి అన్ని బకాయిలను క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా విధానం, ప్రత్యేక విద్యా నిధి, విదేశీ విద్య సహాయం, పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్, డిజిటల్ విద్యా సదు పాయాలు కల్పించాలని ప్రభుత్వానికి  సూ చించారు. విద్యను హక్కుగా గుర్తించి, విద్యార్థుల భవిష్యత్తును కాపాడే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టమైన విధాన ప్రకటన చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన, బీసీ సంఘాలతో కలిసి విస్తృత ఉద్యమ కార్యాచరణ చేపడతామని గుజ్జ సత్యం హెచ్చరించారు.