28 August, 2026 | 1:54 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ఫీజుల బకాయిలు చెల్లించాలి

28-08-2026 01:01 AM
  1. జీవో నెంబర్ 9ని రద్దు చేయాలి
  2. మూతపడే దిశలో 200 కాలేజీలు
  3. బషీర్‌బాగ్‌లో భారీ ర్యాలీ ప్రదర్శన
  4. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్,ఆగస్టు 27(విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని(Fee reimbursement scheme) ఎత్తేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని, జీవో నం. 9ను రద్దు చేసి పాత విధా నంలోనే పథకాన్ని కొనసాగించాలని, వెంట నే ఫీజుల బకాయిలను చెల్లించాలని జాతీ య బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య(R. Krishnaiah) డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థులకు సంబం ధించిన సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బషీర్‌బాగ్‌లో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.

ఈ కా ర్యక్రమానికి రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ నిఖిల్ పటేల్ నాయకత్వం వహించగా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ముదిరాజ్, బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అ ధ్యక్షుడు జీ అనంతయ్య, బీసీ యువజన సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మోడీ రాం దేవ్, సీ రాజేందర్,  శివకుమార్, చిక్కుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సం దర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బకాయి లు చెల్లించకపోవడంతో 6 లక్షలమంది వి ద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, 200 కాలేజీలు మూతపడే దిశలో ఉన్నాయన్నారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగం నిబంధనను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఏపక్ష నిర్ణయాలను ప్రభుత్వం మాను కొని అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చే యాలని, బీసీ సంఘాలు, విద్యావేత్తలతో చ ర్చించాలన్నారు. సమస్యను ప రిష్కరించకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేప డతామని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.