28 August, 2026 | 2:53 PM

బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి

28-08-2026 01:38 PM

ఖమ్మం అర్బన్ జిల్లా కార్పొరేషన్ ఉపాధ్యక్షులు,బ్రాహ్మణ సంఘ నాయకులు కోసూరి ప్రసాద్*

ఖమ్మం, (విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కోసూరి ప్రసాద్ జిల్లా బ్రాహ్మణ సంఘ నాయకులతో కలిసి మాట్లాడుతూ భారత రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత రాష్త్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రమణ్య ప్రసాద్ పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ స్వగ్రామం మధిర నియోజకవర్గం,ఎర్రుపాలెం మండలం చోపకట్లపాలెం అని ఆయన విద్యాభ్యాసం అంతా తెలంగాణలోనే అని ఎవరో వ్రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివిన మీరు స్క్రిప్ట్ ను క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడి ఉంటే బాగుండేదని హితవు పలికారు.భారత రాష్ట్ర సేన అధ్యక్షులుగా ఉన్న కవితమ్మ మీకు ప్రజా ప్రతినిధిగా ఎంతో అనుభవం ఉన్న మీరు నిజా నిజాలు తెలుసు కోకుండా మాట్లాడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 

బసవరాజు శ్రీనివాస్ తెలంగాణ వాసి అని ముఖ్యంగా మా ఖమ్మం ప్రాంత వాసి అని మీకు ఆయనకు సంబంధించి ఎటువంటి ఆధారాలు కావాలన్నా మీకు ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు.అదేవిధంగా ఆయన యస్ సి ఆడపడుచులను విమర్శించారని అనటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు వనం కృష్ణవేణి,కలవల శ్రీనివాస్,ఊటుకూరు చక్రధర్ రావు,  ఏడునూతల ప్రభాకర్ రావు , మేడికొండూరు ప్రసాద్, ఉన్నకోట సంతోష్,అయ్యదేవరరాంగోపాల్, ఏడునూతలఉదయ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.