4 June, 2026 | 11:18 PM

రైతన్నను వెంటాడుతున్న వర్ష భయం

04-06-2026 10:16 AM

అవసరాలను ఆసరాగా చేసుకుని దండుకుంటున్న లారీలవారు

బోథ్,జూన్ 4(విజయక్రాంతి): వర్షాకాలం దూసుకు వస్తున్నది మార్కెట్ లోని జొన్న మొక్కజొన్న పంట బస్తాలు కాంట వేసి ఉన్నాయి. లారీ రాక రైతులు బస్తాలకు కాపలాగా ఉండాల్సి వస్తున్నది. బస్తాలను లారీలో వేసి పంపిస్తే రైతు అక్కడి నుండి కదలాలి. అయితే రైతుల అవసరం లారీల వారికి ఆసరాగా మారింది. 30 రూపాయలు ఇవ్వండి లేకుంటే మేము లారీలను పెట్టేది లేదంటూ బీస్మించుకొని లారీలవారు కూర్చుంటున్నారు. దీంతో రైతులు చేసేది లేక డబ్బులు ఇచ్చి మరి లారీలలో పంపించుకుంటున్నారు.

రైతుల ఇబ్బందులను గమనించాల్సిన అధికార యంత్రాంగం చేతులెత్తేసిందని రైతులు ఆగ్రామ్ లెక్కపరుస్తున్నారు. కాంటాల కోసం రైతులు హమారీలు కొట్టుకోవడంతో మూడు రోజుల క్రితం ఈ కేసు పోలీస్ స్టేషన్ వరకు చేరింది. అయితే తాజాగా గురువారం ఉదయం సైతం రైతులు కాంటాల కోసం కొట్లాడుకున్నారు. ఇంత జరుగుతున్న అధికారులకు పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. అంతటా దోపిడీకి గురవుతున్నామని పంట పండించుకుని ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.