చేపల వేటకు వెళ్లి తండ్రీకొడుకు మృతి
03-06-2026 01:22 AM
- తాలిపేరు వాగులో నీట మునిగిన ఇద్దరు
- మొగుళ్లపల్లి గ్రామంలో విషాదం
చర్ల, జూన్ 2 (విజయక్రాంతి): చర్ల మం డల పరిధిలోని మొగళ్లపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తాలిపేరు వాగు లో చేపల వేటకు వెళ్లిన తండ్రీ కొడుకు నీటి లో మునిగి మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవ డంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్లితే.. మొగళ్లపల్లి గ్రామానికి చెందిన రాముల సూర్యారావు(38), ఆయన కుమారుడు దేవ్ హర్ష తాలిపేరులో చేపలు పట్టేందుకు మం గళవారం ఉదయం వెళ్లారు. ఈ క్రమంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు నీటిలో మునిగి మృతిచెందారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని గాలించి చర్యలు చేపట్టగా ఇ ద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీం తో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.






