13 June, 2026 | 3:00 AM

రైతు కొడుకుకు డాక్టరేట్

12-06-2026 03:34 PM

- ఉచిత విద్య, ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందజేస్తూ...

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): పేద పిల్లలకి ఉచిత విద్యతో పాటు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పాన్ని జీవిత ధ్యేయంగా మార్చుకొని పేద విద్యార్థుల అభున్నతే లక్ష్యంగా సేవలందించిన కరిడె మధుకర్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన చేసిన, చేస్తున్న విశిష్ట సామాజిక సేవలను గుర్తించిన ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ సంస్థ ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది.

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గడ్ పూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ప్రమీల - సత్తయ్య దంపతుల కుమారుడు మధుకర్. పేద కుటుంబం నుంచి వచ్చి వృత్తి విద్యా కళాశాల స్థాపించి.., పేద విద్యార్థులు తాను అనుభవించిన ఆర్థిక కష్టాలు పడవద్దనే సంకల్పంతో ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య, ఉన్నత చదువులు చదివేందుకు అవసరమైన విద్యార్థులకు అర్థిక సహాయం, సామాజిక సేవ అందిస్తున్నారు. ఈ సేవలకి గాను హైదరాబాద్ లో త్వరలో జరుగనున్న అవార్డు ప్రధానోత్సవంలో  గౌరవ డాక్టరేట్ ను అందుకోనున్నారు. రైతు కొడుక్కు డాక్టరేట్ రావడం పట్ల గ్రామస్తులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.