13 June, 2026 | 4:11 AM

ఖానాపూర్ సబ్ రిజిస్టార్ గా కిరణ్ తేజావత్

12-06-2026 03:36 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ సబ్ రిజిస్టార్ గా కిరణ్ తేజావత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం ఇక్కడ విధులు నిర్వహించిన స్వామిదాస్ బదిలీపై నిర్మల్కు వెళ్లడంతో ఆయన స్థానంలో కిరణ్ తేజావత్ ను ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిరణ్ మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన పాలదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.