రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలి
09-05-2026 12:30 AM
తాడ్వాయి,మే, 8( విజయ క్రాంతి): రైతులు పాడి పరిశ్రమపై దృష్టి కేంద్రీకరించాలని తాడ్వాయి పశువైద్యాధికారి రమేష్ తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ పశువైద్య ఉప కేంద్రంలో పశువులకు పశువైద్య చికిత్సలు నిర్వహించారు.
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పశువులకు చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా 31 ఆవులకు, నాలుగు గేదెలకు చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో సవితరెడ్డి, ఏవో నరసింహులు, విజయ డైరీ ఏడి నరసింహులు, ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, డైరీ ప్రెసిడెంట్ నరసింహరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






