20 May, 2026 | 1:51 AM

రైతులు పచ్చిరొట్ట సాగు చేసుకోవాలి

20-05-2026 12:47 AM

జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి

కోహెడ, మే 19:పచ్చిరొట్ట సాగుతో నేల బౌతిక స్థితి మెరుగుపడి గుల్లగా మారుతుందని.. జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి అన్నారు. మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు పచ్చి రొట్ట ఎరువులు 50% సబ్సిడి ద్వారా ప్రభుత్వం విత్తనాలు మంజూరు చేసిందన్నారు. అగ్రోస్ రైతు సేవా కేంద్రం, కేడిసీఎంఎస్ కేంద్రాలలో అందుబాటులో ఉన్నయన్నారు.

రైతులు వరి సాగుకు నెల రోజుల ముందుగా పచ్చిరొట్ట విత్తనం వేయడంతో ఎకరానీకి 10 టన్నుల పచ్చి రొట్ట ఏరువు లబిస్తుందన్నారు. 60 కిలోల నత్రజని, 15 కేజీల భాస్వరం, 50 కేజీల పొటాష్ భూమిలో కలుస్తుందన్నారు. పచ్చి రొట్ట ఎరువులు వేసుకోవడం ద్వారా నేలలోకి నీరు ఇంకే గుణం పెరిగి.. నేలలో సేంద్రీయ పదార్థం మెరుగుపడటం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతయన్నారు.

అలాగే జీవ రసాయనిక చర్యలతో నేల సారం పెరగడమే కాక, నేలకు సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకొని ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుకుంటుందని చెప్పారు . భూమిలో రసాయన ఎరువులు వేసినపుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగ పడతాయన్నారు. కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చని, చౌడు భూముల పునరుద్దరణకు ఉపయోగపడుతుందన్నారు. 

ఎకరానికి 12 నుండి 15 కిలోల విత్తనం అవసరం ఉంటుందన్నారు. కార్యక్రమం లో హుస్నాబాద్ AౄA వీణా రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సతీష్, ఏఎంసి చైర్మన్ బోయిని నిర్మల జయరాజ్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఏఈవో శ్రీధర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.